పవర్ గేమ్ కు సిద్ధమైన పెద్ద జట్లు... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ తాజా సీజన్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు నిలకడైన ఆటతీరు కనబరుస్తున్నాయి. రెండు జట్లలోనూ విధ్వంసక బ్యాటర్లు, ప్రతిభావంతులైన బౌలర్లు ఉండడంతో... ఈ జట్లతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు చెమటోడ్చాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవాళ ఈ రెండు జట్లు పరస్పరం తలపడుతున్నాయి. 

గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఆసక్తికర సమరానికి జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

రాజస్థాన్ జట్టులో జాసన్ హోల్డర్ స్థానంలో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు స్థానం కల్పించారు. గత మ్యాచ్ లో చివరి ఓవర్లో హోల్డర్ అత్యంత పేలవంగా బౌలింగ్ చేసి జట్టు ఓటమికి కారణమవడం తెలిసిందే. ముంబయి ఇండియన్స్ తో జరిగిన ఆ మ్యాచ్ లో చివరి ఓవర్ ను హోల్డర్ విసరగా, ముంబయి బ్యాటర్ టిమ్ డేవిడ్ వరుసగా మూడు సిక్స్ లు కొట్టి రాజస్థాన్ కు ఓటమి రుచిచూపాడు. 

ఇక, ఇవాళ్టి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ జట్టులో మార్పులేమీ లేవు. గుజరాత్ టైటాన్స్ ఇప్పటిదాకా 9 మ్యాచ్ లు ఆడి 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ ల్లో 5 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Rajasthan Royals
Toss
Gujarat Titans
Jaipur
IPL

More Telugu News